విస్తరించిన చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధి…

విస్తరించిన చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధి…

11 గ్రామాల విలీనం…

చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా చిట్యాల మండలం లో ఉన్న చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ నర్రా వినోద మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 22 ప్రకారం, ఇప్పటివరకు చౌటుప్పల్ మార్కెట్ పరిధిలో ఉన్న చిట్యాల మండలానికి చెందిన 11 గ్రామ పంచాయతీలను ఇప్పుడు చిట్యాల మార్కెట్ కమిటీ పరిధిలోకి విలీనం చేశారుఅని తెలిపారు విలీనమైన గ్రామాలలో, పెద్ద కాపర్తి, చిన్న కాపర్తి, ఏపూర్, పిట్టంపల్లి, వెలిమినేడు, గుండ్రంపల్లి, పేరేపల్లి, సుంకనపల్లి, బోయగుబ్బ, ఆరగుడం, బొంగుని చెరువు, ఉన్నాయి.

ఈ గ్రామాలన్ని రేపటి నుంచి చిట్యాల వ్యవసాయ మార్కెట్ ఆధీనంలోకి వస్తాయని తెలిపారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం వ్యవసాయ మార్కెట్ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ సభ్యులు, అధికారులు రైతులు పాల్గొన్నారు..

Leave a Reply