11 days | భక్త బృందాలతో సమన్వయ సమావేశం…

11 days | భక్త బృందాలతో సమన్వయ సమావేశం…

11 days | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో వెలిసిన చరిత్ర మల్లికార్జున స్వామి దేవస్థానంలో మార్చి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉగాది బ్రహ్మోత్సవాల నిర్వహిస్తున్నట్లు 19వ తేదీన ఉగాది పండుగను ఘనంగా చేపట్టాలని శ్రీశైలం కార్యనిర్వాణాధికారి శ్రీనివాస్ రావు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగంటి రమేష్ నాయుడు బుధవారం తెలిపారు. ఈ ఉగాది మహోత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుండి ముఖ్యంగా ఉత్తర కర్ణాటక ప్రాంతం నుండి మహారాష్ట్రలోని షోలాపూర్, సాంగ్లీ తదితర ప్రాంతాల భక్తులు తరలివస్తారన్నారు. వీరిలో పలు ప్రాంతాల భక్తులు పాదయాత్రతో శ్రీశైలం రావడం ప్రతి ఏడాది వేలాదిమందిగా తరలిరావడం విశేషం.

ఈ సందర్భంగా బుధవారం కర్ణాటక రాష్ట్రములోని భాగల్‌కోట్ జిల్లా తాలుకా కేంద్రమైన తేర్‌దాళ్‌లోని అల్లమప్రభు దేవస్థానములో భక్త బృందాలు, స్వచ్ఛందసేవా సంస్థలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ముందుగా ఉదయం గం.9.30 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల ధర్మప్రచార రథయాత్ర బసవేశ్వర సర్కిల్ నుంచి అల్లమప్రభు దేవాలయం వరకు నిర్వహించబడిందన్నారు. ఈ రథయాత్రలో అశేషభక్త జనులు దారి అంతా పూలు చల్లుతూ శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల నామాలను ఉచ్ఛరిస్తూ రథానికి స్వాగతం పలికారు.

ఆ తరువాత తేర్‌దాళ్ పట్టణంలో శ్రీ అల్లమ ప్రభు దేవాలయంలోని సమావేశ మందిరంలో మధ్యాహ్నం గం.12.00లకు సమావేశం ప్రారంభమైనంది. ఈ సమావేశంలో శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామివారు కూడా ఈ సమావేశంలో పాల్గొని అనుగ్రహభాషణం చేశారు. ఈ సందర్భంగా జగద్గురు పీఠాధిపతి వారు ప్రసంగిస్తూ దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థమై ఆయా దర్శన ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు. ఉగాది ఉత్సవాలలో ప్రతీరోజు వేలాది మంది భక్తులు ఆలయానికి రావడం జరుగుతోందన్నారు. భక్తులు అధికసంఖ్యలో ఉంటున్న కారణంగా ఉత్సవాల రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం ఉండదన్నారు.

11 days |

ఈ కారణంగా ఉత్సవరోజులలో దేవస్థానంవారు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించడం జరుగుతోందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భక్తుల సౌకర్యార్థమై దేవస్థానం ఈ విధానాన్ని అనుసరించడం జరుగుతోందన్నారు. అయినప్పటికీ ఉత్సవాలకు ముందు 10 రోజులపాటు అనగా మార్చి ఆరవ తేదీ నుంచి 15వ తేదీ వరకు రోజుకు నాలుగు విడతలుగా దేవస్థానం వారు నిర్దిష్ట వేళలో స్పర్శదర్శానానికి అవకాశం కల్పించడం జరిగిందన్నారు.భక్తులు దేవస్థానం నిర్దేశించిన రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనాన్ని చేసుకోవచ్చునని అన్నారు.

11 days |

ఇంకా పీఠాధిపతివారు మాట్లాడుతూ భక్తులందరు కూడా సంయమనం పాటిస్తూ శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకోవాలన్నారు. అదేవిధంగా దేవస్థానం కల్పించిన ఆయా సదుపాయాలను వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా భక్తులందరు కూడా దేవస్థానానికి సహకరించాలన్నారు. పాదయాత్ర చేసే భక్తులు ఆరోగ్యంపట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మరియు ఉత్సవాలు విజయవంతం చేసేందుకు భక్తులందరూ కూడా సహకరించాలన్నారు.

అలాగే అటవీశాఖ విడుదల చేసిన పాదయాత్రికులు చేయవలసినవి – చేయకూడనవి నియమాలను కూడా భక్తులకు వివరించి చెప్పారు. అలాగే శ్రీశైలక్షేత్రాన్ని స్వచ్ఛ శ్రీశైలక్షేత్రంగా ఉంచాలని అన్నారు. అంతకు ముందు శ్రీశైలదేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు ప్రసంగిస్తూ శ్రీశైలక్షేత్ర సంస్కృతీ సంప్రదాయాలలో కన్నడ ప్రాంతానికి ఎంతో విశిష్టస్థానం ఉందని తెలుపుతూ, కన్నడ భక్తులు శ్రీభ్రమరాంబాదేవివారిని తమ ఆడపడుచుగా, శ్రీమల్లికార్జునస్వామివార్లను తమ అల్లునిగా భావిస్తారన్నారు. ఇటీవల కాలంలో 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరిపించబడ్డాయని, ఇదే పంథాలో ఉగాది మహోత్సవాలను కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు.

అదేవిధంగా ఎప్పటి వలే కాలిబాట మార్గములో భక్తులకు దేవస్థానం మంచినీటి సరఫరా మొదలైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా కాలిబాటలో వచ్చే భక్తులకు అవసరమైన మంచినీరు,మార్గమధ్యంలో దాతల సహకారంతో అన్నదాన ఏర్పాట్లను చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిధిలోని ఆరుబయలు ప్రదేశాలలో విశాలమైన జర్మన్ షెడ్లను, చలువ పందిర్లను వేయడం జరుగుతుందని, భక్తులందరు ఈ చలువపందిర్లలో సేద తీరవచ్చన్నారు. అదేవిధంగా క్షేత్రంలో పలుచోట్ల స్నానపు గదులను, మూత్రశాలలను, మరుగుదొడ్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు.

భక్తులు వీటిని వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు.ఇక పాతాళగంగలోనూ, క్షేత్రపరిధిలో పలుచోట్ల షవరుబాతులకు జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఉగాది మహోత్సవాలలో పలు భక్తబృందాల వారు క్షేత్రపరిధిలో అన్నదానాలు చేయడం జరుగుతోందన్నారు. అన్నదానం చేసే భక్త బృందాల వారికి దేవస్థానం తరుపున సంపూర్ణ సహాయ సహాకారాలను అందించడం జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, పర్యవేక్షకులు ఆర్. మల్లికార్జున, సహాయ సంపాదకులు కె. సత్య బ్రహ్మాచార్య, పలువురు అర్చకస్వాములు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో కర్ణాటకలోని పలు ప్రాంతాలకు చెందిన పాదయాత్ర భక్త బృందాల ప్రతినిధులు, స్వచ్ఛందసేవా సంస్థ ప్రతినిధులు మొత్తం 20 బృందాలు పాల్గొన్నారు.

Leave a Reply