ఆదరించి అండగా నిలవండి అభివృద్ధి చేసి చూపిస్తా

10వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి జుట్ల సంగీత సాగర్
మక్తల్ , ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) ఆదరించండి అండగా నిలవండి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామని మక్తల్ మున్సిపాలిటీలో 10వ వార్డు నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జుట్ల సంగీత సాగర్ అన్నారు. బుధవారం 10వ వార్డు పరిధిలో తన మద్దతుదారులు బిఆర్ఎస్ నాయకులతో కలిసి ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఓటర్లను కలుసుకొని మద్దతు కోరారు. అధికార పార్టీ అబద్ధాల కోరుగా మారిందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలు 420 ,హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు .గత ఎన్నికల్లో ఈ ప్రాంతం నుండి గెలుపొందిన వ్యక్తి అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెర్చారు .బి ఆర్ ఎస్ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని అన్నారు .10వ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే నా ధ్యేయమని అందుకు మీ అందరి అండా దండా కావాలని అభ్యర్థించారు. 10వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తానన్నారు. అదేవిధంగా సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మాణం విద్యుత్తు సదుపాయం తో పాటు మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానన్నారు. బిఆర్ఎస్ ద్వారా మాత్రమే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందన్నారు . కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిన ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు.తెలంగాణ కోసం పోరాడి సాధించిన బిఆర్ఎస్ పార్టీలోనే అభివృద్ధి సాధ్యమని అందుకు ఈ ఎన్నికల్లో మీరంతా తనను ఆదరించి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి 10వ వార్డు నుండి కౌన్సిలర్గా గెలిపించవలసిందిగా జుట్ల సంగీత సాగర్ విజ్ఞప్తి చేశారు .24 గంటలు మీ సేవ కోసం అందుబాటులో ఉంటానని తనను ఆదరించమని కోరారు .ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మక్తల్ పట్టణ అధ్యక్షులు జుట్ల చిన్న హన్మంతు, నాయకులు జె.సాగర్ ,నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
