పరకాలలో 108, 102 అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని పాత మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి 108 102 అంబులెన్స్ లను హన్మకొండ జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్ లో ఉన్నటువంటి పరికరాలు, మందులు, మరియు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. మండల ప్రజలకు అందుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

108 ద్వారా గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 108 ద్వారా 1328 మందికి పైగా అత్యవసర సేవలు అందించినట్టు అలాగే 102 ద్వారా 3840 మంది కి పైగా గర్భిణీ స్త్రీలకు సేవాలాందించినట్టు తెలిపారు. గర్భిణీ స్త్రీలు 102 సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలిపారు.

వేసవికాలం దృష్ట్యా వడదెబ్బ, డయేరియా వంటి కేసులు వస్తాయి అంబులెన్స్ లో ఐస్ ప్యాక్ లు, ఓ ఆర్ ఎస్ ద్రావణాలు నిల్వ ఉంచుకోవాలని సిబ్బంది ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ మండల ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని తెలిపారు. అంబులెన్సు సిబ్బంది ఈ ఎం టీ ఓరుగంటి భాస్కర్ మరియు పైలట్‌ పాముల రాజు 102 కెప్టెన్ వలుగుల అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply