1000 people | డ్రీమ్ యంగ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ కృషి అభినందనీయం

1000 people | డ్రీమ్ యంగ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ కృషి అభినందనీయం

1000 people | విజయవాడ, ఆంధ్రప్రభ : విద్యార్ధుల్లో దాగి ఉన్న ప్రతీభను వెలికితీసేందుకు డ్రీమ్ యంగ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ కృషి అభినందనీయమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు టిడి జనర్ధన్ అన్నారు. శనివారం తెలిపారు.నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 13వ జాతీయ యువ అండ్ చిల్డ్రన్ అర్ట్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాుట చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కళల అభివృద్ధి కి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఆదిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు.నేటి బాలబాలికలే రేపటి భావిభారత పౌరులు.

మీ అందరూ ఎంతో మంది రేపు ఈ వేదిక మీదికి వచ్చే అర్హత సంపాదించే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు మీరు వేసేటటువంటి ఆలోచన, మీరు తీసుకునే నిర్ణయాలు, వేసే బీజాలను బట్టే మీ భవిష్యత్తు ఉంటుందని అన్నారు. రమేష్ ప్రతి యేటా సంస్కృతిక కార్యక్రమాలు చిత్ర కళల పై వేలాది మంది విద్యార్ధులను ప్రోత్సాహించి బహుమతులు అందజేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుండటం అభినందనీయమని అన్నారు. జాతీయ యువ అండ్ చిల్డ్రన్ అర్ట్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాుట చేశారు.డ్రీమ్ యంగ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ ప్రతినిధి రమేష్ మాట్లాడుతూ విద్యార్ధులు దాగి ఉన్న అసాధారణ ప్రతీభను వెలికితీసేందుకు మా సంస్ధ పనిచేస్తోందని తెలిపారు.

వేలాది మంది విద్యార్ధులను ప్రోత్సాహించి బహుమతులు అందజేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నామని తెలిపారు.కత్తులతో రాజ్యాలను గెలవచ్చుకోని కళతో మనస్సు గెలవచ్చునని అక్షరం పుట్టకముందే చిత్ర లేఖనం మొదలైంది.చిత్ర లేఖనం ద్వారా భావాన్ని తెలియచేయడమే సమజంలో మార్పులు తీసుకు రావచ్చునని తెలియచెప్పారు. ఏపి సృజనాత్మక, సంస్కృతి సమితి ఛైర్ పర్సన్ పొడపాటి తేజస్వీ విధ్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో నేను కూడ మీలాగే బహుమతి వస్తుందా రాదా అని ఎదురు చూశానని తెలిపారు.

సాధన ఏదైన సాధ్యమని తెలిపారు.ఈ కార్యక్రమానికి జాతీయ స్ధాయిలో 300 స్కూల్స్ కి చెందిన వేలాది విద్యార్ధులు హాజరయ్యారు. సంప్రదాయ నృత్యాలు , చిత్రకళల పై విద్యార్ధులకు పోటీలు నిర్వహించి విజేతలుగా నిలుచిన వారి ప్రోత్సాహించి ముఖ్య అతిధులు చేతుల మీదుగా బహుమతులు , ప్రశంసపత్రాలు చేశారు..

1000 మంది విద్యార్ధుల అద్భతంగా వేసిన పెయింటిగ్స్ సందర్శన కోసం ఉంచారు.ఈ కార్యక్రమంలో తెలుగు ఆకాడమీ ఛైర్మన్ ఆర్ డి విల్సన్ , ప్రముఖ కళా పోషకులు గోళ్ల నారాయణరావు,బెజవాడ బార్ ఆసోసియేషన్ అధ్యక్షులు బాషా,యామిని ,హిమబిందు,
పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply