1000 Liters |ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు

1000 Liters |ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు
1000 Liters | వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చిన్న గొల్లగూడెం గ్రామంలో ఓలం కంపెనీ(Olam Company) ఆధ్వర్యంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఆ వాటర్ ప్లాంట్‌ను పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్(Gurram Krishna Prasad) కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఓలం కంపెనీ చక్కటి నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం అని సేవా కార్యక్రమాల్లో భాగంగానే 1000 లీటర్ల కెపాసిటీ(1000 Liters Capacity) కలిగిన ఈ ఆర్ వో వాటర్ ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ వాటర్ ప్లాంట్‌ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలం దానం చేసిన బొల్లె ఆదినారాయణకు(Bolle Adinarayana) కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేరూరు మాజీ సర్పంచ్ యాలం సరస్వతి ఆదిత్య, తెలంగాణ, ఆంధ్ర ఇన్చార్జ్ హరికృష్ణ, తెలంగాణ ఇంచార్జ్ ఆర్గనైజర్ సాంబశివరావు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

