1000 liters | నీరు అందుబాటులోకి తీసుకొచ్చేలా చ‌ర్య‌లు…

1000 liters | నీరు అందుబాటులోకి తీసుకొచ్చేలా చ‌ర్య‌లు…

1000 liters | విజ‌య‌వాడ, ఆంధ్రప్రభ : విజయవాడలోని రాణి గారి తోటలోగల నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ ను త్వరగా పూర్తిచేసి, అందుబాటులో తీసుకొచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రాణి గారి తోట, కృష్ణలంక ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాణి గారి తోటలో నిర్మిస్తున్న 1000 లీ. సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసి ప్రజలకు త్వరగా మంచినీటి సరఫరా ఆ ట్యాంకు ద్వారా అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు. అమృత్ 2.0 పథకం కింద చేస్తున్న ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించాలని అన్నారు.

కృష్ణలంక నేషనల్ హైవే లో గ్రీన్ బెల్ట్ ను పెంచాలని ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణ అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి రాణి గారి తోటలో గల అన్న క్యాంటీను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి, వాడుకనీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఏవైనా మరమ్మతులు ఉన్నచో వెంటనే వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కే షమ్మీ, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.సామ్రాజ్యం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply