100 Years | మండల వెంకట కృష్ణారావు..
100 Years, ఆంధ్రప్రభ : స్వర్గీయ మండల వెంకట కృష్ణారావు (Mandal Venkata Krishna Rao) శత జయంతి ఉత్సవాలలో భాగంగా 81వ రోజు సోమవారం మోపిదేవి మండలం కోసురువారి పాలెం జనసేనపార్టీ గ్రామ కన్వీనర్ కాగితాల సాంబశివరావు నాయకత్వంలో మండల వెంకట కృష్ణారావు విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సనకా శాంతారావు, కోసూరు రేణుకయ్య, జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దివిసీమలో ఉప్పెన సమయంలో మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వేలాదిమంది ప్రజల ఆకలి తీర్చిన మహనీయుడు మండలి వెంకటకృష్ణారావు అని కొనియాడారు.

