100 crores | మాటల వెనుక మర్మం ఏంటి..?

100 crores | మాటల వెనుక మర్మం ఏంటి..?

Nikhil 100 crores | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్వయంభు. ఈ సినిమా గత కొంతకాలంగా నిర్మాణం జరుపుకుంటూనే ఉంది. దీనికి కారణం వీఎఫ్ఎక్సే. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ కారణంగా సినిమాల నిర్మాణం ఆలస్యం అవుతుండడం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నిఖిల్ చేసిన ట్వీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే.. వివాదస్పదం అయ్యింది. ఇంతకీ.. నిఖిల్ ఏమని ట్వీట్ చేశాడు. నిఖిల్ టార్గెట్ చేసింది ఎవర్ని..?

100 crores | ఏఐ వాడలేదు..

నిఖిల్ నటిస్తున్న స్వయంభు మూవీ నుంచి ఇటీవల టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాని రూపొందిస్తుండడం విశేషం. ఈ టీజర్ లాంచ్ ప్రెస్ మీట్ లో ఈ సినిమాకి ఏఐ వాడారా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఏఐ వాడలేదు.. అది పెద్ద స్క్రీన్స్ కు వర్కవుట్ కాదు అంటూ నిఖిల్ చెప్పాడు. అయినప్పటికీ.. ఈ మూవీ టీజర్ కు ఆన్ లైన్ లో నెగిటివ్ కామెంట్స్, ఏఐ కామెంట్లు వచ్చాయి. అలాగే క్వాలిటీ మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. దీంతో లేటెస్ట్ గా హెచ్డీఆర్ క్వాలిటీతో మరోసారి టీజర్ అప్ లోడ్ చేశారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ పీఆర్ఓ ట్వీట్ చేశారు.

100 crores | ఏఐ వాడిన సినిమా అదేనా..

100 crores |

ఈ ట్వీట్ ను నిఖిల్ రీ ట్వీట్ చేసారు. అంతే కాకుండా.. ఎందుకు భయ్యా ఇలా గ్లిచ్ చేశావ్.. రీసెంట్ గా రిలీజైన సినిమాల్లా మా సినిమాలో ఏఐ వాడలేదు అన్నారు. ఇలా ట్వీట్ చేయడం వివాదస్పదం అయ్యింది. నిఖిల్ ఏ సినిమా గురించి కామంట్ చేశారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలోనూ అలాగే ఇండస్ట్రీలోనూ దీని గురించి చర్చ నడుస్తుంది. భారీ విజువల్స్ తో సినిమా తీస్తే.. ట్రోలింగ్ తప్పడం లేదు. ఆమధ్య విశ్వంభర నుంచి టీజర్ రిలీజ్ చేస్తే.. ఏమాత్రం క్వాలిటీ లేదంటూ ట్రోలింగ్ జరిగింది. దెబ్బకి సినిమా వాయిదా పడింది. ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.

100 crores | నిఖిల్ కామెంట్స్ నాగబంధం గురించా..?

ఇక అసలు విషయానికి వస్తే.. రీసెంట్ గా రిలీజైంది అన్నాడు కాబట్టి విశ్వంభర గురించి అయితే కాదు. మరి.. ఏ సినిమా గురించి అంటే.. సూపర్ స్టార్ మహేష్‌ బాబు చేతుల మీదుగా నాగబందం టీజర్ రిలీజైంది. ఇందులో విక్రాంత్ హీరోగా నటించాడు. అభిషేక్ నామా డైరెక్టర్. కొత్త హీరో అయినప్పటికీ 100 కోట్లు బడ్జెట్ పెట్టారు. భారీ వీఎఫ్ఎక్స్ తో రూపొందిస్తున్న సినిమా ఇది. రెండున్నర నిమిషాల టీజర్ లో వీఎఫ్ఎక్స్ ఎక్కువుగా వాడారు. దీంతో నిఖిల్ కామెంట్స్ నాగబంధం టీజర్ గురించే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

100 crores | నిఖిల్ టార్గెట్ చేసింది రాజాసాబ్ గురించా…?

కొంత మంది అయితే.. నిఖిల్ కామెంట్ చేసింది నాగబంధం టీజర్ గురించి కాదు.. రాజాసాబ్ గురించి అని కూడా అంటున్నారు. ఎందుకంటే.. రీసెంట్ గా రిలీజైన సినిమాల మా సినిమాలో ఏఐ వాడలేదు అన్నాడు. రీసెంట్ గా రిలీజైన సినిమాల్లో ఏఐ వాడారని ట్రోలింగ్ జరిగింది రాజాసాబ్ మూవీకే. అందుకే.. నిఖిల్ కామెంట్ చేసింది ఈ సినిమా గురించే అనే చర్చ నడుస్తుంది. నిఖిల్ వివాదాలకు దూరంగా ఉంటాడు. మరి.. ఎందుకు ఇలా కామెంట్ చేసాడు.. అనేది ఆసక్తిగా మారింది. ఈ ట్వీట్ తో కాంట్రవర్శీ అయితే.. తన స్వయంభు సినిమాకి క్రేజ్ వస్తుంది అనుకున్నాడా.. అనే మాటలు కూడా వినిస్తున్నాయి. చూడాలి మరి.. ఈ కాంట్రవర్శీ పై నిఖిల్ క్లారిటీ ఇస్తాడో లేదో..?

click here to read more : 4sides | పెద్ద ప్లాన్! భారీ పాన్-ఇండియా మిథాలజీ యాక్షన్ మూవీ రెడీ

click here to read more :

Leave a Reply