పది గ్రాముల బంగారం ధర రెండు వేలు పెరిగిందోచ్
- చెన్నైలో 18 క్యారెట్లు ధర రూ.లక్ష దాటిందండి
బిజినెస్ డెస్క్, ఆంధ్రప్రభ : దసరా సరదా తీరింది. మరి కొన్ని గంటల్లో దీపావళి హంగామా చల్లబడుద్ది. రెండు రోజులుగా.. మౌనం పాటించిన బంగారం ధర కూడా అమావాస్య(new moon) రుచిని జుర్రుతోంది. లక్ష్మీ బాంబు పేలుడుని గుర్తు చేసింది. మంగళవారం తన సత్తాను చూపించింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం(24 carat gold) ధర రూ.1,32,770లకు చేరింది. అంటే రూ.2,080లు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,900లు పెరిగి రూ.1,21,700లకు చేరింది.
18 క్యారెట్ల బంగారం ధర రూ. 1.560లు పెరిగి రూ.99,580లకు చేరింది. ఇక సామాన్యులు కొనే ఆభరణాల ధర ఆకాశం వైపు దూసుకు పోతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయాలకు చేరుతోంది. అమావాస్య రోజునే అత్యధికులు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అందుకే రెండు రోజుల పాటు బంగారం ధరకు కళ్లెం వేసిన బులియన్ మార్కెట్.. మంగళవారం బంగారం ప్రియులకు వాత పెట్టింది. దీపావళి(Diwali)కి రెండు రోజుల ముందు బంగారం ధర తగ్గింది. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మూడు వేలు పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చిన బంగారం ధర ఈ రోజున (శనివారం) రూ.1910లు తగ్గింది.
మధ్యాహ్నం 12.00 గంటలకు అందిన సమాచారం మేరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,860లకు చేరింది. శుక్రవారం ఈ ధర 1,32,770లు పలికింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం(Friday) రూ.1,21, 770లకు పలుకగా .. ఈ రోజు రూ.1,19,950లకు చేరింది. అంటే రూ.1,750లు తగ్గింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.98,140 లకు చేరింది. శుక్రవారం ఈ ధర రూ.99,580లు పలికింది. ఈ రోజు రూ.1,450లకు తగ్గింది.
నిజానికి 24 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం రూ.3,330లు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,050లు, 18 క్యారెట్ల బంగారం రూ.2,500లు పెరిగింది. తాజాగా డాలర్(dollar) విలువ తగ్గిందని చెబుతున్నా.. భారత దేశంలో అమావాస్య రోజునే బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. ఈ స్థితిలోనే బంగారం ధర మళ్లీ పెరిగింది.
నగరం 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 18 క్యారెట్స్
హైదరాబాద్ రూ.1,32,770లు రూ.1,21,700 లు రూ.99,680లు
వరంగల్ రూ.1,32,770లు రూ.1,21,700 లు రూ.99,680లు
విజయవాడ రూ.1,32,770లు రూ.1,21,700 లు రూ.99,680లు
గుంటూరు రూ.1,32,770లు రూ.1,21,700 లు రూ.99,680లు
విశాఖపట్నం రూ.1,32,770లు రూ.1,21,700 లు రూ.99,680లు
చెన్నై రూ.1,32,880లు రూ.1,21,800 రూ.1,00,600లు
కోల్కత్త రూ.1,32,770లు రూ.1,21,700 లు రూ.99,680లు
ముంబై రూ.1,32,770లు రూ.1,21,700 లు రూ.99,680లు
ఢిల్లీ రూ.1,32,920లు రూ.1,21,850లు రూ.99,730లు
బెంగళూరు రూ.1,32,770లు రూ.1,21,700 లు రూ.99,680లు
కేరళ రూ రూ.1,32,770లు రూ.1,21,700 లు రూ.99,680లు
అహ్మదబాద్ రూ.1,32,820లు రూ.1,21,750లు రూ.99,630లు
వడోదర రూ.1,32,820లు రూ.1,21,750లు రూ.99,630లు