10 dec cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

10 dec cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

ఐటీ రంగంలో ప్రవాస భారతీయుల ఆధిపత్యాన్ని సహించలేక.. వీసా వార్ కి దిగిన అమెరికా లోకల్ హీరో ట్రంప్… (America Rice Dispute) తాజాగా భారతీయ రైతులపై దృష్టి సారించారు. అమెరికాలో భారతీయ ఉద్యోగుల నోరు కొట్టటమే లక్ష్యంగా.. ఆకలి అస్త్రాన్ని ప్రయోగించి.. రైస్ ను దూరం చేయటానికి అమెరికా అధ్యక్షుడు సన్నద్ధం అవుతున్నారు. .
బియ్యం దిగుమతిని ( Indian Rice Import) డంపింగ్ సరకుగా (Dumping Essential) అభివర్ణించారు. ( America Rice Dispute) త్వరలో భారత బియ్యానికి కప్పం ఉచ్చు (Tariff Trap) బిగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో… అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కడుపులో మంట వెలుగు చూసింది.
అమెరికాలో దిగుమతి అవుతున్న భారతీయ బియ్యంపై అదనపు సుంకాలను ( Additional Tariff) విధించక తప్పదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించి సరి కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. (America Rice Dispute) భారత్ ఈ సరకును అమెరికాలో డంపింగ్ చేస్తోంది, అలా ఎందుకు జరుగుతోంది, అని ఈ సమావేశంలో ట్రంప్ ప్రశ్నించారు.
ఈ దిగుమతుల కారణంగా దేశీయ ఉత్పత్తి దారులు సవాళ్లను ఎదుర్కొంటున్నారని, బియ్యం ధరలు తగ్గుతున్న విషయాన్ని కెన్నెడీ రైస్ మిల్స్ (Kennedy Rice Mills Ceo) వ్యవస్థాపకుడు, సీఈఓ మెరిల్ కెన్నెడీ (Meril Kennedy) ఈ విషయాన్ని ట్రంప్‌నకు వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అమెరికన్ రైతులకు 12 బిలియన్ డాలర్ల ( రూ.1,08,000 కోట్లు ) తాజా సహాయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా తన ఆంతర్యాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. .
America Rice Dispute భారత్‌పై బియ్యంపైనే ఫోకస్
అమెరికాలోకి బియ్యం డంపింగ్ చేస్తున్నట్టు కొన్ని దేశాల జాబితాను అధ్యక్షుడు ట్రంప్ నకు అందించగా.. భారత్ (India), థాయ్‌లాండ్, (Thailand) చైనా (Chaina) దేశాలపై ఆరోపణలు గుర్తించారు. భారత్ గురించి చెప్పండి. భారత్‌కు ఎందుకు అనుమతి ఉంది? సుంకాలు చెల్లించాలా, వద్దా ? బియ్యం పై మినహాయింపు ఉందా?” అని ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్‌ను ట్రంప్ ప్రశ్నించారు.
“లేదు సార్, ఇంకా భారత్ వాణిజ్య ఒప్పందంపై పనిచేస్తున్నాం అని బెస్సెంట్ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించగా, “అవును, కానీ భారత బియ్యం డంపింగ్ చేయకూడదు. ఈ విషయాన్ని ఇతరుల నుంచి కూడా విన్నాను. భారత్ అలా చేయకూడదు ,” అని ట్రంప్ అడ్డుకున్నారు. అమెరికాలోకి భారతీయ బియ్యం అక్రమంగా డంపింగ్ (Un Autherised) అవుతోందనే ఆరోపణలను గట్టిగానే పరిశీలిస్తామన్నారు.
