యూరియా ఉంది కానీ…

యూరియా ఉంది కానీ…

గ‌జ్వేల్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బారులు తీరిన క్యూ లైన్లు… గంటలకొద్దీ నిరీక్షణ(Hours of waiting)…చివరకు తమ నిరీక్షణ ఫలిస్తుందో లేదో తెలియని సంధిగ్ధత…ఇదంతా యూరియా కోసం మహిళా రైతుల బాధ. ఇంతలో తోపులాట మొదలైంది…ఒక్కొక్కరి(each one)లో ఆందోళన మొదలైంది.

ముందువాళ్ళు వెనక్కి…వెనకున్నవాళ్ళు ముందుకి…క్యూలైన్లన్నీ అస్తవ్యస్తంగా…అక్కడి పరిస్థితి క్షణాల్లో గందరగోళంగా తయారైంది…పంపిణీ ప్రారంభానికి ముందే తోపులాట(in a tussle) తీవ్రమైంది…అది కాస్తా చెప్పుల‌తో కొట్టుకునేదాకా వెళ్ళింది.

తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన సంఘ‌ట‌న వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఈ రోజు చోటుచేసున్న ఈ ఘర్షణలో రాత్రి, పగలు తేడా లేకుండా యూరియా(Uria) కోసం లైన్ లో నిలబడితే ఒక్క బస్తా కూడా దొరకని పరిస్థితి వారిలో తీవ్ర ఆందోళనకు కారణమైంది.

దీంతో యూరియా పంపిణీ(distribution) చేసిన‌ప్పుడు క్యూలో ఉన్న‌వారు ముందుకు దూసుకుపోవ‌డంతో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ వివాదాలు వారిమధ్య పరస్పరం గొడవలకు, కొట్లాట‌కు దారితీస్తుంది. తమ సొంత పనులని వదిలి కుటుంబాన్ని విడిచి యూరియా కోసం లైన్లో నిలబడే(standing) దుస్థితి నెల‌కొంద‌ని పలువురు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

దుకాణాలలో యూరియా బస్తాలు ఉన్నాయి, కానీ అధికారులు, కొంతమంది నాయకులు యూరియా బస్తాలను పక్కదారి పట్టిస్తూ బ్లాక్ లో అమ్ముకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Leave a Reply