¾ Lady Medicos : డాక్టరమ్మలొస్తున్నారోచ్ Andhra prabha top Story

¾ Lady Medicos : డాక్టరమ్మలొస్తున్నారోచ్ Andhra prabha top Story
¾ మెడికల్ సీట్లు అమ్మాయిలవే
ఎంబీబీఎస్ కాదు.. డెంటల్ వదల్లేదు
యునానీ..ఆయుష్ లోనూ …
అబ్బాయిలు బిక్కమొహం
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్య్ ప్రతినిధి)
ఆమె సృష్టికి మూలం. మానవ మనుగడకు ఆరంభం ఆమె. అందుకే అవనిలో సగం.. ఆకాశంలోనూ సగం. ఇదే మాతృమూర్తి పితృస్వామ్యంలో అనేక కష్టాలు పడింది. కన్నీళ్లు కార్చింది. అగ్నిపరీక్షతో తన శీలం ఘనతను చాటింది. ఇప్పటికీ..ఈ నవసమాజంలోనూ లింగ వివక్షతతో.. గర్భస్థ శిశువుగా ఆడపిల్ల ఛిద్రమైపోతున్న కథలు ప్రతీరోజూ వింటుంటాం.

కానీ.. గడచిన మూడు దశాబద్ధాల్లో.. ఆడపిల్లలు చదువుల్లో రాణిస్తున్నారు. ఉద్యోగాల్లో.. రక్షణ రంగంలో.. పోలీసు శాఖలో.. రాజకీయాల్లో తమ సత్తా చాటుతున్నారు. తాజాగా.. వైద్య విద్యలో.. ఆడపిల్లలే సివంగులయ్యారు. ఏపీలో ఎంబీబీఎస్, డెంటల్, ఆయూష్ కోర్సుల్లో.. అత్యధిక సీట్లు ఆడపిల్లలు కొల్లగొట్టేశారు.
¾ Lady Medicos : సింహభాగం సీట్లు అమ్మాయిలదే

2025..-26 విద్యా సంవత్సరంలో మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల్లో తీరు తెన్నును ఓ సారి పరిశీలిద్దాం. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ సమర్పించిన నివేదిక ప్రకారం.. అండర్ గ్రాడ్యుయేట్ మెడిసిన్ కోర్సుల్లో అమ్మాయిలే అధిక శాతం సీట్లు దక్కించుకున్నారు. డెంటల్, ఆయుష్ వైద్య విద్యలో ప్రవేశాలు పొందిన వారిలో అమ్మాయిల శాతం 76.17% నుంచి 85% మధ్య నమోదైంది. ఎంబీబీఎస్ లో సీట్లు 60.72% మంది అమ్మాయిలు ఎంబీబీఎస్ సీట్లు పొందారు. మొత్తం మీద నాలుగింట మూడువంతులు మహిళడాక్టర్లు రెడీ (¾ Lady Medicos ) అవుతున్నారు.
¾ Lady Medicos : అమ్మాయిల మధ్యే తీవ్ర పోటీ

2025-..26 విద్యా సంవత్సరంలో వైద్య విద్యలోనికి ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ((Ntr Health University) ద్వారా జరిగిన ప్రవేశాల తీరును విశ్లేషించినప్పుడు సీట్లు దక్కించుకోవడంలో అమ్మాయిల మధ్యన పోటీ ఎక్కువగా కనిపించింది. ఈ వివరాలను విశ్వవిద్యాలయం ఉపకులపతి (Vice Chanceller) చంద్రశేఖర్ (Chandra Sekhar) రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి (Ap Health Minester) సత్యకుమార్ యాదవ్ (SatyaKumar Yadav) కు నివేదించారు.

అందులో పేర్కొన్న ప్రకారం కన్వీనర్ కోటాలోనే కాకుండా యాజమాన్య కోటాలోని సీట్లను కూడా అమ్మాయిలే అత్యధికంగా దక్కించుకున్నారు. ఎంబీబీఎస్ లోని సీట్లు రాని అమ్మాయిలు బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో చేరేందుకు ప్రాధాన్యమిచ్చారు. వైద్య విద్యను అభ్యసించేందుకు అమ్మాయిలు పాఠశాల విద్య నుంచే సన్నద్ధమవుతూ ఎక్కువ సీట్లు దక్కించుకుంటున్నారు. ఈ విషయం మరోమారు 2025…-26 ప్రవేశాల ద్వారా కూడా స్పష్టమైంది.
¾ Lady Medicos : అన్నింట్లోనూ అమ్మాయిలే ధీరలు !

బీడీఎస్: ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో (BDS) మొత్తం 1,519 సీట్లకు 1,157 (76.17%) సీట్లను అమ్మాయిలు దక్కించుకున్నారు. కన్వీనర్ కోటాలో 76.31%, యాజమాన్య కోటాలో 76.09% చొప్పున సీట్లు వీరికి లభించాయి. హోమియోలో (Homeo) మొత్తం 526 సీట్లలో 380 (83.70%) అమ్మాయిలు పొందారు. కన్వీనర్ కోటాలో 83.33%, యాజమాన్య కోటాలో 85% చొప్పున సీట్లు పొందారు. ఆయుర్వేదంలో 98 సీట్లలో 74 అమ్మాయిలు (75.51%) దక్కించుకున్నారు. యూనాని కాలేజీల్లో 42 సీట్లలో 34 సీట్లు (85%) అమ్మాయిలు దక్కించుకున్నారు.
¾ Lady Medicos : ఎంబీబీఎస్ లోనూ…

ఎంబీబీఎస్ లోని మొత్తం సీట్లలో 60.72% అమ్మాయిలు దక్కించుకున్నారు. కన్వీనర్, యాజమాన్య కోటాలోని సీట్లు పొందడంలో వీరే ముందున్నారు. 2024-25లో ఇంచుమించు ఇలాగే ప్రవేశాలు జరిగాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య వాసిడి ద్వారా జరుగుతున్న పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో mbbs అమ్మాయిలు ముందుంజలో కనిపిస్తున్నారు.
¾ Lady Medicos :

ఇప్పటికే ఇంజనీరింగ్, ఫార్మశీ కాలేజీల్లో తమ సత్తా చాటుకుని .. ఐటీ కంపెనీలకు మూలపుటమ్మలుగా ఎదుగుతున్నారు. విదేశీ కంపెనీలు భారతీయ వనితల ఎదుట సాహో అంటున్నారు. అమెరికా, కెనడా. బ్రిటన్ ల్లో ఫార్మశీ అమ్మాయిలే ఆయా కంపెనీలకు ఆధారమయ్యారు. ఇక రాబోయే ఐదేళ్లల్లో ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రుల్లో నాలుగింట మూడొంతుల మంది డాక్టరమ్మలే .. జనం ప్రాణాలను కాపాడుతారు. అందుకే వేటూరి సుందరరామ్మూర్తి వల్లే వేసినట్టు ఆడదే ఆధారం, కథకు ఆరంభం, ఆదడే సంతోషం అని భావిద్దాం.
ALSO READ : DanceQueen Real Reel: ఆడే పిల్లే కాదు Andhra prabha TOP story
