విద్యకు ఊపిరి పోసిన పాఠశాల గౌరవ గాథ..

విద్యకు ఊపిరి పోసిన పాఠశాల గౌరవ గాథ..

పేరూరు జడ్పీహెచ్ఎస్‌కు 75 ఏళ్లు…
నాలుగవ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం
కీలక నిర్ణయాలు తీసుకున్న పూర్వ విద్యార్థులకు

మహబూబ్ నగర్,ఆంధ్రప్రభ: కౌకుంట్ల మండలం పేరూరు గ్రామంలో 1950 జూన్‌లో వెలుగు చూసిన జడ్పీహెచ్ఎస్ పాఠశాల 2026 ఏప్రిల్ నాటికి 75 ఏళ్ల గర్వకారణమైన విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. నాటి పల్లె మట్టి బెంచీల నుంచి నేటి ఆధునిక విద్యా ఆశయాల వరకు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ఈ పాఠశాల, పేరూరు గ్రామానికి విద్యా హృదయంగా నిలిచింది. ఈ అపూర్వ ఘట్టాన్ని చరిత్రగా మలచేందుకు పూర్వ విద్యార్థులందరి ఐక్యతతో ఈ ఏడాది ఏప్రిల్ 19 న ఘనమైన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి.


ఈ నేపథ్యంలో సమ్మేళన సన్నాహాలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఆదివారం జరిగిన ఆర్గనైజింగ్ కమిటీ సమావేశంలో పూర్వ విద్యార్థులు సమ్మేళన కార్యాచరణ, నిధుల సమీకరణ, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. 75 ఏళ్లుగా విద్యకు ఊపిరిగా నిలిచిన జడ్పీహెచ్ఎస్ పేరూరు పాఠశాల మరో స్వర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుందని పూర్వ విద్యార్థుల ఆర్గనైజింగ్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply