ఘ‌నంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం

ఘ‌నంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం

తిరువూరు, ఆధ్రప్రభ : పేదల కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు తొలగించడానికే వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందని తిరువూరు నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి నల్లగట్ల స్వామిదాసు అన్నారు. గురువారం తిరువూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. 16 సంవత్సరాల క్రితం ఏర్పాటైన వైఎస్సార్సీపీ ప్రజలపక్షాన నిలిచి వారి సామాజిక, ఆర్థిక ప్రగతికి బాసటగా నిలుస్తోందని స్వామిదాను పేర్కొన్నారు.

రాష్ట్రంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు ప్రజల ప్రగతికి ఎంతో దోహద పడగా, ఆయన హతాన్మరణంతో రాజకీయ అనిశ్చితి నెలకొన్న తరుణంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ స్థాపనకు తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో ప్రజలకు ఆశాకిరణంగా నిలిచారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో పథకాలను కూటమి పాలకులు తుంగలో తొక్కారన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వైఎస్సార్సీవీకే ప్రజాదరణ పుష్కలంగా ఉందన్నారు.

గత ఎన్నికల్లో కుట్రపూరితంగా ఈవీఎంలను మాయచేసి గెలిచిన కూటమి ప్రభుత్వం ప్రజల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు. రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, ప్రజల ఇబ్బందులు తొలగించే దమ్ము, ధైర్యం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే ఉందని ఆయన అన్నారు.

తిరువూరు మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు తాళ్ళూరి. నవీన్ కుమార్, రేగళ్ళ మోహన్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు పురిటిపాటి సుధారాణి, తిరువూరు నగరపంచాయతీ కౌన్సిలర్లు మోదుగు ప్రసాద్, పరసా శ్రీనివాసరావు, ఎరువ ప్రకాష్ రెడ్డి, పార్టీ నాయకులు వెలుగోటి ఆదినారాయణ, దేవిశెట్టి బాలకృష్ణ, మామిడి కుటుంబరావు, గుమ్మా పాపారావు, బొర్రా మోహనరావు, మాయిరి వెంకటరమణ, నల్లబోతుల రమాదేవి, కొలికపోగు నాగరాజు, శ్రీనాధ్, మురళీకృష్ణారెడ్డి, కరీం, నెహ్రూ, వహాబ్, రవికుమాూర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపూరు కమ్యూనిటీ అసుపత్రిలో రోగులకు పాలు, పళ్ళను పంపిణీ చేశారు.

Leave a Reply