ysrcp | ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకో…చంద్రబాబూ..!

ysrcp | ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకో…చంద్రబాబూ..!
అభద్రతలో చంద్రబాబు
వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి
ysrcp | అనంతపురం, ఆంధ్రప్రభ; అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి నిర్వహించారు. చంద్రబాబు ఇప్పటి వరకు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు రాజకీయంగా ఆయన అభద్రతా భావంలో మునిగిపోయారని తెలిపారు. చంద్రబాబుపై ఆయనకే నమ్మకం లేదు. 20 నెలల్లో ఆయన ఇచ్చిన హామీలు అరకొరగా అమలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
కల్తీ మద్యం అంటాడు. వివేకానందరెడ్డి హత్య అంటాడు. చివరకు శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్, టీడీపీ నేతలు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది మా పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రమణ్యం. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్ ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు సీబీఐ అధికారులు ఉంటే మరో ఇద్దరు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఉన్నారు. చివరకు లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు గానీ, గొడ్డు మాంసం కొవ్వు గానీ, పంది కొవ్వు గానీ లేదని ఎన్‌డీఆర్‌ఏ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌లు తేల్చినా ఇంకా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు దుష్ప్రచారాలు ఆపడం లేదు. సిట్ నివేదికలో వాస్తవాలు బయటకు రావడం చంద్రబాబుకు రుచించడం లేదు. తాను ఆరోపణలు అపద్ధమని తేలడంతో మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చెప్పిందే సుప్రీంకోర్టు, సీబీఐ నివేదికలో రావాలన్నట్లుగా ఆయన ఉంది. కోట్లాది మంది హిందువుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు. శ్రీవారి లడ్డూను మహాప్రసాదంగా అందరూ తీసుకుంటారు. అలాంటి లడ్డూను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాడు.లడ్డూలో కెమికల్స్ కలిశాయని మరో దుష్ప్రచారానికి దిగారు. చంద్రబాబుకు ఎంతో పరిపాలన అనుభవం ఉంది. అలాంటి వ్యక్తి బాత్‌రూంలో కలిపే కెమికల్స్ శ్రీవారి లడ్డూలో కలిపారని చెప్పడానికి నోరెలా వచ్చింది?
ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకో…చంద్రబాబూ..!
ఎన్నికల సమయంలో మహిళలకు నెల నెలా రూ.1500 ఇస్తామన్నారు.. నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎవరైనా ఈ హామీల గురించి అడిగితే ఉండండయ్యా లడ్డూలో కల్తీ జరిగింది అంటూ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. చివరకు కేబినెట్ సమావేశాల్లోనూ ఇదే చర్చలు. చంద్రబాబుకు జగన్ ఫోబియా పట్టుకుంది. చివరకు నిద్రలో కూడా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు జగన్‌ను కలవరిస్తున్నారు. చంద్రబాబు తన సొంత మామ ఎన్టీఆర్, ఆ తర్వాత హరికృష్ణపై కూడా వ్యక్తిగత ఆరోపణలు చేసి లబ్ది పొందాడు.రాజకీయాల్లో తనకు ఎవరు అడ్డువచ్చినా వారిపై లేనిపోని ఆరోపణలు చేయడం చంద్రబాబుకు అలవాటు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కూడా ఏదో ఒక మరక అంటించాలని అనుకుంటున్నాడు. తక్కువ ధరకు నెయ్యి వస్తుందా? అని అంటున్నారు. చంద్రబాబు కూడా వ్యాపారంలో ఉన్నాడు. డెయిరీలు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో తక్కువ ధరకే నెయ్యి కొనుగోలు చేయలేదా?
చంద్రబాబు హయాంలో సరఫరా జరిగి రిజెక్ట్ చేసిన ట్యాంకర్ల నుంచి తీసుకున్న శాంపిళ్ల మీదే ప్రస్తుతం కేసు నడుస్తోంది. తక్కువ ధరకే నెయ్యి దొరుకుతుందా? అని చంద్రబాబు అంటున్నారు. మీ హయాంలోనే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ నుంచే రూ.320, రూ.321కి సరఫరా జరిగింది వాస్తవం కాదా? పరిపాలనలో అన్ని రకాలుగా వైఫల్యం చెందిన చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. శ్రీవారి లడ్డూ విషయంలో తనకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చే వరకు విచారణ చేయాలన్నదే లక్ష్యంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. అందుకే సిట్ నివేదిక వచ్చినా మళ్లీ ఏకసభ్య కమిషన్ అంటున్నాడు. 20 నెలల కాలంలో రూ.3 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఎక్కడ ఖర్చు చేశారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. చంద్రబాబు పాపం పండడం వల్లే శ్రీవారి లడ్డూ విషయంలో ఆయన చేసిన ఆరోపణలపై వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పటికైనా చందబాబు, కూటమి నేతలు క్షమాపణలు చెప్పి పరిపాలన, ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టండి.

