
Ys Jagan | కేంద్ర హోంశాఖకు లేఖ..
Ys Jagan | కేంద్ర హోంశాఖకు లేఖ..
Ys Jagan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రతపై కేంద్ర హోంశాఖకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం లేఖ రాశారు. ఇటీవల జరిగిన జగన్ పర్యటనలో భద్రతా లోపాలు తలెత్తిన అంశాలను విచారణకు తీసుకోవాలని ఆయన కోరారు. 22 కిలోమీటర్ల దూరాన్ని 47 కిలోమీటర్లుగా పొడిగించడంపై మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం జగన్ భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉందని ఫిర్యాదు చేశారు. జగన్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర హోమ్ శాఖకు విజ్ఞప్తి చేశారు.
