Youth | స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి

Youth | స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
Youth | దండేపల్లి, ఆంధ్రప్రభ : స్వామి వివేకానందుడి బోధనలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని దండేపల్లి మండలం రెబ్బనపల్లి ఉపసర్పంచ్ ఉరటి వినోద్ అన్నారు. స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… యువత(youth)లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించడంలో స్వామి వివేకానంద బోధనలు మార్గదర్శకమని అన్నారు.
యువత లక్ష్యసాధనలో పట్టుదలతో ముందుకు సాగాలని, సమాజ సేవను తమ జీవిత లక్ష్యంగా చేసుకోవాలన్నారు. వివేకానందుని ఆలోచనలు నేటి యువతకు దిశానిర్దేశకమని, విద్య, క్రీడలు(sports), సేవా కార్యక్రమాల ద్వారా సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో, పంచాయతీ కార్యదర్శి గంగారాం, హౌసింగ్ ఏ ఈ అమీర్ ఖాన్, మాజీ సర్పంచ్ కొట్టే సత్తయ్య, యూవన సభ్యులు మేకల కుమార్, ఎంబడి సురేష్, భార్గవ్, మధుకర్, తిరుపతి, రంజిత్, శ్రవణ్, లడ్డు, సునీల్, రమేష్,పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
