యువకుడు గల్లంతు

వాజేడు, ఆంధ్రప్రభ : యువకులు జాగ్రత్తలు తీసుకోకపోతే విహార యాత్ర విషాదం (vacation tragedy)గా మారుతోంది. కొందరు యువకులు అతి ఉత్సాహంతో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ రోజు వాజేడు మండలం కొంగాల జలపాతం (Kongala Falls)లో ఓ యువకుడు గల్లంతయ్యాడు. దీంతో జలపాతం ప్రాంతమంతా ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

ములుగు జిల్లా (Mulugu district) వాజేడు మండల పరిధిలోని కొంగాల జలపాతాన్ని సందర్శించడానికి హైదరాబాదు(Hyderabad)కు చెందిన ఎనిమిది మంది స్నేహితులు (friends) ఆదివారం ఉదయం వచ్చారు. అందులో ఒక యువకుడైన మాన్ అశ్విన్(18) జలపాతంలో ప్రమాదవశాత్తు పడిపోయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మిగిలిని వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు, ఫారెస్ట్ అధికారులు (forest officials) చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
