టిప్పర్ ఢీకొని యువకుడు మృతి

టిప్పర్ ఢీకొని యువకుడు మృతి
- మంగళపల్లి వద్ద విషాదం…
- ఆగ్రహంతో గ్రామస్తుల ధర్నా
భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని మంగళపల్లి గ్రామం వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే… మంగళపల్లి గ్రామానికి చెందిన కదిరే కిరణ్ (26) సోమవారం తెల్లవారుజామున హైదరాబాదుకు వెళ్లేందుకు హనుమకొండ–సిద్దిపేట ప్రధాన రహదారిపై తన స్నేహితుడు అంబాల రాజు ద్విచక్ర వాహనంపై ఎక్కుతున్న సమయంలో, వెనుక నుండి అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కిరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, అంబాల రాజుకు తీవ్ర గాయాలు అయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
