Youth | అభివృద్ధికే పట్టం కట్టాలి
- హాజిపల్లి సర్పంచ్ అభ్యర్థి కారుకొండ నవీన్ కుమార్
Youth | షాద్ నగర్, ఆంధ్రప్రభ : యువతకు అవకాశం కల్పించి.. అభివృద్ధి పరిచే వారికే పట్టం కట్టాలని హాజిపల్లి సర్పంచ్ అభ్యర్థి కారుకొండ నవీన్ కుమార్ (Naveen Kumar) ప్రజలకు పిలుపునిచ్చారు. తాను షాద్ నగర్ నుండి కిషన్ నగర్ వరకు రోడ్డు వేయిస్తానని, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తనకు అవకాశం కల్పిస్తే హాజిపల్లిని అభివృద్ధి పరంగా తీర్చిదిద్దుతానన్నారు.

