రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఆంధ్రప్రభ ప్రతినిధి, వరంగల్: కారు అదుపు తప్పడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన పర్వతగిరి మండలం ఏనుగుల్లులో జరిగింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందిన యాకుబ్ కుమారుడు సోహెల్ వరంగల్ నుంచి గూడూరుకు కారులో వెళ్తున్నాడు. ఏనుగల్లు గ్రామ శివారులో కారు అదుపు తప్పి బోల్తా పడగా, ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సోహెల్
అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఎంజిఎం వరంగల్కు తరలించారు.
