Sitarama Rath Yatra | యువకుడు మృతి..

Sitarama Rath Yatra | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లాలో నిర్వహించిన సీతారామ రథయాత్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రథం కింద పడిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా చేబ్రోలు ప్రాంతంలో జరిగిన సీతారామ రథయాత్ర సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కత్తిపూడికి చెందిన దుక్కా వెంకటేష్ అనే యువకుడు రథం కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటనలో వెంకటేష్ అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనతో రథయాత్రలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
