వికారాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రప్రభ): వికారాబాద్ మండలం ఎర్రవల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ దేవత ప్రతిష్ట కార్యక్రమం గురువారం కొనసాగింది. బుధవారం నుండి శుక్రవారం వరకు ఈ జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఆర్టీఏ మెంబర్ ఎర్రబలి జాఫర్ తెలిపారు. మల్లేశం స్వామి నేతృతంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి గురువారం పూర్ణాహుతి చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ దేవాలయం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్టీఏ మెంబర్ జాఫర్ తో పాటు మాజీ సర్పంచ్ సుభాన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Vikarabad | ఎర్రవల్లిలో ఘనంగా ఎల్లమ్మ దేవత ప్రతిష్ట
