Yedapally | సీఎం సభకు తరలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

Yedapally | సీఎం సభకు తరలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు
Yedapally | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం సభలో పాల్గొనేందుకు శుక్రవారం తరలివెళ్లారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం శివారు ప్రాంతం కేశాపూర్ గ్రామ శివారు లో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సభా ప్రాంగణానికి వెళ్లేందుకు గాను ప్రజాప్రతినిధులు ఆర్.టి.సి స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశారు.
