నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ : పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకే కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకు వచ్చారని ఎమ్మెల్సీ నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాష ఆరోపించారు. నంద్యాల పట్టణంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలోశుక్రవారం ఇంటింటికి తిరిగి వెళ్లి ప్రజల సంతకాలు సేకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య కళాశాలలపై ప్రజాభిప్రాయాన్ని కోటి సంతకాల రూపంలో సేకరించి గవర్నర్ కు అందచేసి, ప్రయివేటకరణను అడ్డుకోవాలని వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు తన హయాంలో ఒక్క మెడికల్ కళాశాలను తీసుకు రాలేకపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనలో స్పౌజ్ పెన్షన్లు మినహా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదన్నారు. వికలాంగుల పెన్షన్లలో కూడా సదరం పేరుతో కోతలు వేస్తుండడం అన్యాయ మన్నారు.ఒక్క నూతన పక్కా గృహం కూడా మంజూరు కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఇన్స్యూరెన్స్ లోకి తీసుకెళ్లు చున్నారన్నారు. రూ2700 కోట్ల బకాయిలు పెట్టడం వల్ల ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు సమ్మె చేస్తుండం వల్ల రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కోటి సంతకాలతో ప్రజల ప్రతిఘటన – ఉద్యమానికి అపూర్వ స్పందన…
ఒక సంతకం, పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తుందన్న నమ్మకంతో కోటి సంతకాల ఉద్యమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళలు, రైతులు, నిరుద్యోగ యువత ఈ ఉద్యమంలో తమ భాగస్వామ్యాన్ని చాటుకుంటున్నారన్నారు

