Yadagirigutta | తాళ్లగూడెం అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలి

Yadagirigutta | తాళ్లగూడెం అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలి

  • మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్

Yadagirigutta | యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : మండలంలోని తాళ్లగూడెం గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సుదగాని స్వప్న శ్రీహరి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు ఐక్యతతో పని చేయాలని సూచించారు. గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply