Yadadri Temple | బంగారం, వెండి డాలర్లు మాయం…

Yadadri Temple | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బంగారు, వెండి డాలర్ల మాయమమైన వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన బంగారం, వెండి డాలర్లు పెద్ద సంఖ్యలో గల్లంతవ్వడం ఆలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా, ఆలయ రికార్డులను తాజాగా పరిశీలించిన ఆడిట్ అధికారుల తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగు చూశాయి.
ముఖ్యంగా ఆలయానికి చెందిన ప్రచార శాఖలో నిల్వ ఉంచిన డాలర్ల లెక్కల్లో భారీ తేడాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. స్వామివారి ప్రతిమతో ఉన్న డాలర్ల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ప్రచార శాఖలో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతారాహిత్యం వల్లే చోరీ జరిగిందని భావిస్తున్నారు.
