Yadadri | స్వర్ణగిరిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

Yadadri | స్వర్ణగిరిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

  • కిక్కిరిసిన వెంకటేశ్వర ఆలయం
  • భక్తులకు ఉత్తర ద్వార దర్శనం

Yadadri | ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ‌ భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దర్శన సౌకర్యాలు, క్యూలైన్లు, భద్రత, త్రాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టారు.

Yadadri

ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే పుణ్యఫలాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఉన్న నేపథ్యంలో, అధిక సంఖ్యలో భక్తులు భక్తి శ్రద్ధలతో వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మురళీకృష్ణ, గోపి కృష్ణ పాల్గొన్నారు.

Yadadri
Yadadri
Yadadri

Leave a Reply