WPL 2025 |ఇండియన్స్ కు తొలి విజయం
వడోదర – వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2025 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు విజయాన్నందుకుంది. గుజరాత్ జెయింట్స్‌తో మంగళవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. హర్లీన్ డియోల్(31 బంతుల్లో 4 ఫోర్లతో 32), కేశ్వీ గౌతమ్(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20) టాప్ స్కోరర్‌గా నిలవగా..మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్(3/16) మూడు వికెట్లు తీయగా.. నాట్ సీవర్ బ్రంట్(2/26), అమెలియా కేర్(2/22) రెండేసి వికెట్లు పడగొట్టారు. షబ్నిమ్ ఇస్మాయిల్, అమన్‌జోత్ కౌర్ తలో వికెట్ తీసారు.
అనంతరం ముంబై ఇండియన్స్ 16.1 ఓవర్లలోనే 5 వికెట్లకు 122 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. నాట్ సివర్ బ్రంట్(39 బంతుల్లో 11 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. అమెలియా కేర్(19) మెరుపులు మెరిపించింది. గుజరాత్ బౌలర్లలో ప్రియా మిశ్రా, కేశ్వీ గౌతమ్ రెండేసి వికెట్లు తీయగా.. తనూజ కన్వార్ ఓ వికెట్ పడగొట్టింది.