WPL 2025 | జోరుమీదున్న ఢిల్లీ.. బెంగ‌ళూరుకు ఝల‌క్ !

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ మహిళల జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ టోర్నీలో వరుస విజయాలతో దుమ్ము రేపుతోంది. ఈరోజు బెంగళూరులో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన ఢిఫెండింగ్ ఛాంపియ‌న్ ఆర్సీబీ… నిర్ణీత ఓవ‌ర్ల‌లో 147/5 ప‌రుగులు సాధించింది. బెంగ‌ళూరు బ్య‌ట‌ర్ల‌లో ఎలిస్ పెర్నీ (60) అర్ధ‌శ‌త‌కంతో రాణించి మ‌రోసారి జ‌ట్టును ఆదుకుంది. అయితే కెప్టెన్ స్మృతి మంధాన (8) నిరాశ ప‌రిచింది. ఇక ఢిల్లీ బౌల‌ర్లో నల్లపురెడ్డి చరణి, శిఖా పాండే రెండేసి వికెట్లు తీయ‌గా.. మారిజానే కాప్ ఒక వికెట్ ద‌క్కించుకుంది.

ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్… ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఓపెనర్ షఫాలీ వర్మ (80), జెస్ జోనాసెన్ (61) వరుస బౌండరీలతో చెల‌రేగారు. దీంతో ఢిల్లీ జట్టు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.

ఇక ఈ విజయంతో 8 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న ఢిల్లీ… పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక‌ ముంబై ఇండియన్స్ 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉండ‌గా… బెంగళూరు జట్టు నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *