WPL 2025 | ముంబైకి షాకిచ్చిన ఢిల్లీ..

డబ్ల్యూపీఎల్‌ మూడో సీజన్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్‌కు ఢిల్లి క్యాపిటల్స్ షాకిచ్చింది. ఈరోజు (శుక్రవారం) బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లి 9 వికెట్ల తేడాతో ముంబైపై ఘన విజయం సాధించింది.

ముంబై నిర్ధేశించిన‌ 124 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ… 14.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకిన క్యాపిటల్స్ నాకౌట్ ఆశలు కూడా మెరుగయ్యాయి.

ఓపెనర్‌ షెఫాలీ వర్మ (43; 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదిరే ఆరంభాన్ని అందించింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (60 నాటౌట్‌; 49 బంతుల్లో 9 ఫోర్లు) సూపర్‌ హాఫ్‌ సెంచరీతో ఢిల్లి విజయాన్ని పరిపూర్ణం చేసింది. జెమీమా కూడా 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.

అంతకుముందు తొలుత‌ బ్యాటింగ్‌ చేసిన ముంబై.. ప్రత్యర్థి ఢిల్లీ బౌలర్లు మిన్ను మణీ (3/17), జెస్‌ జొనసేన్‌ (3/25) దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులే చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (22), హీలీ మాథ్యూస్‌ (22), నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (18), అమన్జోత్‌ కౌర్‌ (17), అమెలియా కేర్‌ (17) పరుగులు చేశారు. కానీ, భారీ స్కోర్లు సాధించడంలో ముంబై బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *