world cup |టీమిండియాకు షాక్‌!

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌న‌కు స్టార్ ఆల్ రౌండర్ దూరం?
  • వాషింగ్టన్ సుందర్‌కు తీవ్ర‌మైన గాయం

world cup |వెబ్‌డెస్క్ (స్పోర్ట్స్‌), ఆంధ్ర‌ప్ర‌భ : వ‌చ్చే నెల‌లో టీ20 వరల్డ్ కప్ 2026 జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో టీమిండియాకు షాక్ త‌గిలింది. సిద్ధమవుతున్న తరుణంలో స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో ఆ మెగా టోర్నీలో ఆడ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. గాయంతో ఇప్ప‌టికే న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న వాషింగ్టన్ సుందర్, ఇప్పుడు రాబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. వడోదరలో జరిగిన మొదటి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో సుందర్‌కు సైడ్ స్ట్రెయిన్(పక్కటెముకల కండరాల గాయం) అయ్యింది. ఆ మ్యాచ్‌లో కేవలం 5 ఓవర్లు మాత్రమే వేసిన సుందర్, తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడాడు. తాజాగా వచ్చిన స్కానింగ్ రిపోర్టుల ప్రకారం, ఈ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనవరి 21 నుండి నాగ్‌పూర్‌లో ప్రారంభం కాబోయే టీ20 సిరీస్‌లో కూడా అతను ఆడలేడని తేలిపోయింది.

రాబోయే టీ20 వరల్డ్ కప్ 2026 కోసం టీమిండియా సిద్ధమవుతున్న తరుణంలో సుందర్ దూరమవ్వడం జట్టు బ్యాలెన్సింగును దెబ్బతీస్తుంది. పవర్ ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా, లోయర్ ఆర్డర్‌లో మెరుపు బ్యాటింగ్‌తో ఆదుకునే సుందర్ లేకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది.

Leave a Reply