పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : మంత్రి
మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలో నిర్మిస్తున్న 150 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను ఈ రోజు సాయంత్రం రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Dr. Vakiti Srihari) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.42 కోట్ల తో నిర్మిస్తున్న ఆస్పత్రి నిర్మాణం(Hospital Construction) పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆరు రోడ్ల కూడలిలో ఆసుపత్రిని నిర్మించడం వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆయనతోపాటు బి కే ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు జి. లక్ష్మారెడ్డి(G. Lakshma Reddy), మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు బోయ రవికుమార్, వాకిటి శ్యామ్, వాకిటి హన్మంతు, పూజ శివరాజ్ తదితరులు ఉన్నారు.

