workers | గ్రామ పంచాయతీ కార్మికులకు దుస్తుల పంపిణీ…

workers | గ్రామ పంచాయతీ కార్మికులకు దుస్తుల పంపిణీ…
workers | వాంకిడి, ఆంద్రప్రభ : మండలంలోని చోపన్ గూడ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు సర్పంచ్ దూర్వ జైనూబాయి . బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న శ్రమ వెలకట్టలేనిదని కొనియాడారు.
గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం అన్ని రకాల సేవలను పంచాయతీ సిబ్బందికి అందిస్తున్నామని అన్నారు. గ్రామ ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా గ్రామపంచాయతీ సిబ్బందికే అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ, సంగీత ఉప సర్పంచ్ ఆత్రం ముత్తు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
