తొలి భూగర్భ రైల్వే స్టేషన్ పనులు చకచక
- ఇప్పటికి 84 శాతం పనులు పూర్తి
( ఆంధ్రప్రభ, ముంబై ) : దేశంలోనే తొలి భూగర్భ బుల్లెట్ రైలు స్టేషన్(Bullet train station) పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 84 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రతిష్టాత్మక ముంబై.. -అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్‌లో ఏకైక భూగర్భ రైల్వే స్టేషన్ కోసం దాదాపు 32.5 మీటర్ల లోతు వరకు భూగర్భంలో తవ్వుతున్నారు. ఇది దాదాపు 10 అంతస్తుల భవనం ఎత్తు. భూమి తలం నుంచి దాదాపు 26 మీటర్ల దిగువన ప్లాట్ ఫారం(Platform) ఉంటుంది, కాన్ కోర్స్, ప్లాట్‌ఫారమ్, సర్వీస్ ఫ్లోర్ అనుసంధానంగా మూడు స్థాయిల్లో ఆరు ప్లాట్‌ఫారమ్‌లను అనుసంధానం చేస్తుంది. దాదాపు 415 మీటర్ల పొడవు, మెట్రో లైన్ 2 బీ (2B) ఎంటీఎన్ ఎల్ ( MTNL) భవనానికి ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి. ఈ స్టేషన్లో సహజ లైటింగ్ కోసం స్కై లైట్ సదుపాయాలు, ప్రయాణీకుల కదలికకు విస్తృత కాన్కోర్స్లు ప్లాట్‌ఫారమ్ స్థాయిలో ఆధునిక సౌకర్యాలను సమకూర్చుతున్నారు.
“సుమారు 84 శాతం తవ్వకం పనులు (అంటే, 15.7 లక్షల క్యూబిక్ మీటర్లు) పూర్తయ్యాయి. ఈ స్థలంలో మొత్తం 18.7 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని జరుగుతుంది ” అని ఒక అధికారి తెలిపారు. నిర్మాణంలోని అత్యంత లోతులో ఎం -60 గ్రేడ్ ఉష్ణోగ్రతను – నియంత్రించే కాంక్రీటుతో బేస్ స్లాబ్ పనులు జరుగుతున్నాయి. బేస్ స్లాబ్(base slab)కోసం మాత్రమే రెండు లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటును వినియోగిస్తామని అధికారులు తెలిపారు, ఇందులో 51,000 క్యూబిక్ మీటర్లకు పైగా ఇప్పటికే నిల్వ చేశారు. అధిక-గ్రేడ్ ఎం 80 ఉష్ణోగ్రత -నియంత్రిత(Temperature-Controlled) కాంక్రీటుతో వేస్తున్నారు.
గంటకు 120 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన మూడు బ్యాచింగ్ ప్లాంట్లను ఈ ప్రదేశంలో ఏర్పాటు చేశారు. ఐస్ చిల్లర్ ప్లాంట్లతో అమర్చారు , కాస్టింగ్ ప్రక్రియ(casting process) సమయంలో కాంక్రీట్ ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి. సైట్‌లోని ఒక ఆధునిక కాంక్రీట్ ప్రయోగశాల(concrete laboratory) నీటి పార గమ్యత వేగవంత క్లోరైడ్ చొచ్చుకుపోయే పరీక్షలను నిర్వహిస్తుంది. సెకెంట్ పైలింగ్, క్యాపింగ్ బీమ్‌లు వరద గోడలు వంటి నిర్మాణాత్మక అంశాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ పని పూర్తికాగానే ముంబై- అహ్మదాబాద్(Mumbai- Ahmedabad) బుల్లెట్ రైలు కారిడార్ ఇంటర్ సిటీ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, ప్రయాణీకులకు ఇప్పటికే ఉన్న రవాణా ఎంపికలకు వేగవంత , సురక్షిత మరింత విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.