ICC | వచ్చే నెల నుంచి మహిళల ట్రై-నేషన్ సిరీస్ !

బరిలోకి భారత్‌, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు

ఐసిసి మహిళల ప్రపంచ కప్ 2025కు ముందు ఉత్కంఠభరితమైన మహిళల ట్రై నేష‌న్ వన్డే సిరీస్ కు రంగం సిద్ధమైంది. మహిళల ట్రై-నేషన్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ ఏప్రిల్ 27 నుండి ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జ‌ట్లు పాల్గొంటున్నాయి. కాగా, ఈ ట్రై-నేషన్ సిరీస్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది.

కాగా, ఈ సిరీస్ లో ప్రతి జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడనుండ‌గా… టాప్-2 జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్ మే 11న జరుగుతుంది.

మ్యాచ్‌ల షెడ్యూల్‌

  • ఏప్రిల్‌ 27: భారత్‌-శ్రీలంక
  • ఏప్రిల్‌ 29: భారత్‌-దక్షిణాఫ్రికా
  • మే 1: శ్రీలంక-దక్షిణాఫ్రికా
  • మే 4: శ్రీలంక- భారత్‌
  • మే 6: భారత్‌-దక్షిణాఫ్రికా
  • మే 8: శ్రీలంక-దక్షిణాఫ్రికా
  • మే 11: ఫైనల్‌.

ఇదిలా ఉండగా, ఈ ఏడాది చివర్లో భారత్ లో జరగనున్న ఐసిసి మహిళల ప్రపంచ కప్‌కు ముందు ఈ ట్రై నేష‌న్ సిరీస్ మూడు జట్లకు కీలకమైన వార్మప్ ఈవెంట్‌గా ఉపయోగపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *