మహిళల హక్కుల సాధనకై పోరాడాలి..

మహిళల హక్కుల సాధనకై పోరాడాలి..

తొర్రూరు,ఆంధ్రప్రభ : మహిళలపై వేధింపులు అరికట్టాలని, హక్కుల సాధనకై పోరాటాలే శరణ్యమని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆలకుంట్ల దుర్గమ్మ తెలిపారు. ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళల హక్కులు కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆలకుంట్ల దుర్గమ్మ మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు పనిచేస్తున్నప్పటికీ పలు రంగాల్లో వారికి సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదన్నారు.మహిళల శ్రమ పురుషులతో పోల్చితే మూడింట రెండు వంతులు ఉందని, కానీ వారికి ఆదాయంలో 10 శాతం మాత్రమే వాటా దక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రమ చేసే కార్మిక మహిళలకు ఉద్యోగ భద్రత లేదని, కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ లు తీసుకువచ్చి మహిళలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. మహిళలు రాత్రి వేళల్లో పనిచేసేలా లేబర్ కోడ్ ఉందన్నారు. మహిళల హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, దానికి వ్యతిరేకంగా మహిళా లోకం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు మమత, శారద, యాకలక్ష్మి, సూర వెంకటమ్మ, పద్మ, శిరీష, ఇంద్రమ్మ, ఉప్పలమ్మ, కళమ్మ, సాయమ్మ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply