ప్రియుడితో కలిసి..

ప్రియుడితో కలిసి..

మహబూబాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : మూడుముళ్ల బంధంతో ఒకటైన భార్యాభర్తలు(husband and wife) ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదిరించి, జీవితాన్ని కొనసాగిద్దామని అనుకున్నబంధానికి, భార్య భర్తను, ప్రియుడితో కలిసి, చంపాలని అనుకున్నసంఘటన, మహబూబాబాద్ మండలంలోని నడివాడ, గ్రామ శివారు గడ్డి గూడెంలో సోమవారం తెల్లవారుజాము(dawn)న చోటుచేసుకుంది.

స్థానికుల వివరాలు ఇలా ఉన్నాయి. గడ్డిగూడెం గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తితో గత సంవత్సరం రష్మితతో వివాహం జరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరి దంపతులకు ఒక బాబు కూడా జన్మించారు. అయితే మహబూబాబాద్(Mahbubabad) జిల్లాలోని కొత్తగూడ ప్రాంతానికి చెందిన అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

అది కాస్త ప్రేమగా మారి, ఎలాగైనా భర్త ప్రసాదును చంపాలని ఆలోచన రావడంతో భార్య రశ్మిత ఫోన్ ద్వారా ప్రియుడి(boyfriend)కి సమాచారం ఇచ్చి గడ్డి గూడానికి రప్పించింది. అర్ధరాత్రి సమయంలో భర్త ప్రసాదు నిద్రిస్తున్నక్రమంలో కాళ్లు చేతులు కట్టేసి హత్య చేయాలని ప్రయత్నిస్తున్న‌(trying) స‌మ‌యంలో ప్రసాద్ ఒక్కసారిగా కేకలు వేస్తూ తీవ్ర గాయాలతో బయటకు పరుగులు తీశారు. దీంతో ప్రియుడు, ప్రియురాలు పరారైనట్లు తెలిపారు.

తీవ్ర గాయాలతో ఉన్న ప్రసాదును వెంటనే మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి(to the hospital) తరలించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. గడ్డి గూడెం గ్రామంలో జరిగిన సంఘటనపై బాధితుడు ప్రసాద్, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు(complaint) మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై దీపిక తెలిపారు.

Leave a Reply