700 మంది విద్యార్థులతో…

700 మంది విద్యార్థులతో…

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆన్లైన్లో గీతా పారాయణం(Gita recitation) ఈరోజు వీనుల విందుగా జరిగింది. శ్రీ దత్తనాద ప్రభు(Sri Dattatreya Prabhu) గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదేశం మేరకు కోటి సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా, నాగలక్ష్మి (తేలప్రోలు) నిర్వహించారు.
గీతా మకరందం ఆన్ లైన్ గ్రూప్‌(Online Group)లో 700 శ్లోకాలు 700 మంది విద్యార్థుల(Students)తో పారాయణం చేశారు. సుమారు 1000 మంది భక్తులు వీక్షించారు.

గీతా మకరందం ఆన్లైన్ గ్రూప్ ద్వారా భగవద్గీత(Bhagavad Gita) ఉచిత శిక్షణ ఇవ్వబడునని నాగలక్ష్మితెలిపారు. దత్త పీఠం(Datta Peetham)లో, దత్త నాద ప్రభువుల ద్వారా గోల్డ్ మెడల్(Gold Medal) పొందిన టీచర్స‌ తో, ఉచ్చారణ దోషాలు లేకుండా సుశిక్షణ ఇవ్వబడుతుందని చెప్పారు.

ఇప్పటికి 5 వేల మంది శిక్షణ పొందారన్నారు. అర్థాలతో, అందరికి అనువయిన సమయాల్లో నేర్పిస్తున్నామన్నారు.

Leave a Reply