Winning | రాయపోల్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గా 2019లో భర్త మధ్ధ ప్రవీణ్ గెలిస్తే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో బేగంపేట గ్రామపంచాయతీ సర్పంచ్ గా మద్ద గీత గెలుపొందారు. బేగంపేట గ్రామంలో 887 మంది ఓటర్లు ఉన్నాయి. బేగంపేట బీసీ మహిళ కు రిజర్వేషన్ కేటాయించడంతో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మద్ధ ప్రవీణ్ తన భార్య గీత ను బిఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలిపారు. హోరాహోరి ప్రచారంలో ప్రత్యర్థి తీగుళ్ల లక్మిపై 297 ఓట్ల మెజారిటీతో గీత గెలుపొందారు.
Winning | నాడు భర్త.. నేడు భార్య

