‘ఒరు అదార్ లవ్’ సినిమాలో ఒక్క వింక్ సీన్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి ప్రియా ప్రకాష్ వారియర్. వైరల్ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకున్న ప్రియా ప్రకాష్, ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ సినీ రంగాల్లో అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక ఎప్పటికప్పుడు ఫ్యాషన్ లుక్స్‌లో కొత్తదనాన్ని ట్రై చేస్తూ, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ప్రియా.. అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఇదే కారణంగా ఆమె తరచుగా హాట్ టాపిక్‌గా మారుతున్నారు.
తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో తన అభిమానులను ఆకట్టుకున్నారు. ఆమె షేర్ చేసిన బ్లాక్ & వైట్ ఫోటోలో ఓ అందమైన డ్రెస్‌లో, నాజూకైన డిజైన్‌లతో మెరిసిపోయింది. ఈ లుక్‌కి “రెట్రో” స్టైల్ టచ్ ఉన్నట్టుగా పేర్కొంటూ, “కొంచెం రెట్రో అయాలో?” అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోపై అభిమానులు మంత్రముగ్ధులై ప్రశంసలు కురిపిస్తున్నారు.






