rice | అవినీతి లేకుండా.. సుపరిపాలన అందిస్తా

rice | అవినీతి లేకుండా.. సుపరిపాలన అందిస్తా

  • సర్పంచ్ అభ్యర్థి కర్రె వెంకటేశం

rice | రాజాపేట, ఆంధ్రప్రభ : అవినీతి లేని సుపరిపాలన అందిస్తా… చెప్పిందే చేస్తా.. చేసేదే చెప్తా.. కుల మతం(caste religion), పార్టీల కతీతంగా గ్రామ అభివృద్ధికై సేవకుడిగా పనిచేస్తా.. ఒక్కసారి అవకాశమిచ్చి ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని సర్పంచ్ అభ్యర్థి కర్రె వెంకటేశం కోరారు. ఇవాళ‌ మండలంలోని రేణిగుంట గ్రామంలో గడపగడపకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

గ్రామంలో పేదింటిలో ఆడపిల్ల పుడితే బంగారు తల్లి పథకం కింద స్వతహాగా రూ.5 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని, మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ, పేదింటి ఆడబిడ్డ పెళ్లికి క్వింటాల్ సన్న బియ్యం(rice) అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి వీధుల్లో సీసీ కెమెరాలు, డిజిటల్ లైబ్రరీ, అండర్ డ్రైనేజీ పనులు, ఆర్వో వాటర్ ఫిల్టర్, మూడు నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాలు(free medical camps) ఏర్పాటు చేస్తానన్నారు.

నిరుపేద కుటుంబంలో అకస్మాత్తుగా ఎవరైనా మృతిచెందితే రూ.5వేల సాయం, క్రీడా ప్రాంగణాలు, దుర్గమ్మ గుడి, రామ మందిర నిర్మాణాలకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. గ్రామంలో వైకుంఠ రథం ఏర్పాటు చేస్తూ, ప్రతి సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఒక్కసారి ఆశీర్వదించి గెలిపిస్తే.. రేణిగుంట గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్ది సేవకుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply