ఏపీలో మళ్లీ వర్షాలు..?

ఏపీలో మళ్లీ వర్షాలు..?

మొంథా తుఫాన్ ఎంతగా నష్టం కలిగించిందో తెలిసిందే. దీనిని నుంచి ఇంకా తేరుకోక ముందే మరోసారి ఏపీలో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచన జారీ చేసింది. ఆంధ్రప్రదేవ్ లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియచేశారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగుతలో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా కోనసీమ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని.. హెచ్చరిక జారీ చేసింది.

Leave a Reply