ఒక ఉగాది పచ్చడిలోనే కాదు, మన నాలుక గ్రహించేది ఆరు రుచులు. మధుర, ఆవ్లు, లవణ, కటు-, కషాయ, తిక్త అని. అనగా తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు. ప్రకృతిలో ఉన్నవి ఆరు రుచులు. మనకి కావలన్నా 7వ రుచి దొరకదు.
ప్రకృతిలో ఉన్న ఆరు రుచులను సంవత్సరాదినాడు చూస్తాము. ఇవన్నీ ప్రకృతిలో సహజంగా లభిస్తాయి. అవన్నీ ఒక చోట కలిపి ఆరగిస్తే మన నోటికి ఏ రుచి ఎక్కువగా తగిలితే ఆ సంవత్సరం ఆ గ్రహ ప్రభావం మనపై ఉంటు-ంది అని భావము. తీపి గురు శుక్రులు, పులుపు శని, ఉప్పు కుజుడు, కారం బుధుడు, కషాయం సూర్యుడు, తిక్త అనగా చేదు చంద్రుడు. అన్ని రుచులూ సమానంగా ఉంటే సమఫలం అని భావము. ఈ రుచులను మొదట భగవానునకు నివేదన చేసి ప్రసాదంగా తీసుకోవాలి.
