గెలిచేదెవరు..? ఆసక్తికరంగా మారిన ఐదో టెస్టు

  • విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్..
  • మరో 35 రన్స్ చేస్తే ఇంగ్లాండ్ గెలుపు..
  • ఆఖరి రోజు తేలనున్న ఫలితం..
  • ఓవల్ : ఐదో టెస్టు (Fifth Test) లో విజయం దోబూచులాడుతోంది. ఆసక్తికరంగా సాగుతున్న మ్యాచ్ ఆదివారం మరింత రసవత్తరంగా మారింది. గెలుపునకు భారత్, ఇంగ్లాండ్ (India, England) జట్లు సమాన దూరంలో ఉన్నాయి. ఆదివారమే విజేత ఎవరో తేలుతుందని అంతా భావించినప్పటికీ ఆఖరులో వర్షం అంతరాయంతో ఫలితం ఆఖరి రోజుకు పోస్ట్ పోన్ అయ్యింది. భారత జట్టు ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల లక్ష్యం నిర్దేశించిన విషయం తెలిసిందే. ఓవర్ నైట్ స్కోరు (Overnight score) 50/2తో ఛేదనను కొనసాగించిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 339/6 స్కోరు చేసింది.

హ్యారీ బ్రూక్ (Harry Brook) (111), జోరూట్ (Joe Root) (105) సెంచరీలతో చెలరేగి ఇంగ్లాండ్ ను గెలుపు దిశగా నడిపించారు. వారు క్రీజులో ఉన్నంత సేపు భారత జట్టులో ఆశలు లేవు. అయితే, ఆఖరులో భారత బౌలర్లు పుంజుకోవడంతో పరిస్థితి మారిపోయింది. ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంకా 35 పరుగులు కావాలి. భారత్ విజయానికి 4 వికెట్ల దూరంలో ఉంది. కీలక వికెట్లు పడగొట్టిన టీమిండియా (Team India) ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ ను కట్టడి చేస్తుందో లేదో చూడాలి. గెలిస్తే సిరీస్ 2-2తో సమవుతుంది. ఓడితే 3-1తో సిరీస్ ఇంగ్లాండ్ కైవసం చేసుకుంటుంది.

స్వల్ప వ్యవధిలోనే రెండు కీలక పడటంతో ఇంగ్లాండ్ కష్టాల్లో (Trouble England) పడింది. మరోవైపు, టీమిండియా గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ను హ్యారీ బ్రూక్, జోరూట్ ఆదుకున్నారు. ముఖ్యంగా బ్రూక్ దూకుడుగా ఆడి జోష్ పెంచాడు. అయితే, అతను 19 రన్స్ వద్దే అవుటయ్యేవాడు. బౌండరీ వద్ద సిరాజ్ (Siraj) క్యాచ్ పట్టడంలో విఫలమవడంతో అతను అవుటయ్యే ప్రమాదం నుంచి భయటపడ్డాడు. అక్కడి నుంచి మరింత దూకుడు పెంచాడు.

మరోవైపు, జోరూట్ ((Joe Root) కూడా అతనికి తోడయ్యాడు. రూట్ ఆచితూచి ఆడుతూ భారత బౌలర్ల (Indian bowlers) ను పరీక్షించాడు. ఈ క్రమంలో ఇద్దరూ శతకాలు పూర్తి చేశారు. ఈ జోడీ 4వ వికెట్ కు ఏకంగా 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జత చేయడంతో స్కోరు 300 దాటింది. వీరి అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు తిరిగింది. ఆఖరి రోజు విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తోందో చూడాలి.

Leave a Reply