నిత్య దీపారాధని, నైమిత్తిక దీపారాధన, కామ్య దీపారాధన అని మూడు రకాల దీపారాధనలు కలవు. ప్రతి నిత్యం దైవారాధనకు చేసిది నిత్య దీపారాధన. ఈ దీపారాదన ప్రాత: కాలం అనిగా సూర్యోదయం కంటే ముందు, సాయంత్రం సూర్యాస్తమయం కంటే ముందే చేయాలి. దీపంతో వెలుతురు తేవడం నిత్య దీపారాధనలోని అంతరార్ధం. చీకటి ఉన్నప్పుడు చీకటి రాకముందు దీపారాధన చేయాలి. జాతకర్మ, నామకరణం, అన్నప్రాసన, ఆక్షర స్వీకారం మొదలగు శుభ కర్మలలో చేసిన సైమిత్తిక దీపారాదన, చీకటి, వెలుతురులతో సంబందం లేకుండా శుభ కర్మలు జరిగినప్పుడు దీపారాధన చేయాలి. కోరికలు నెరవేరాలని చేసే వ్రతాదులు, కామ్య కర్మలలో చేసేది కామ్య దీపారాధన. ప్రతం ఆరంభించే ముందు అనగా కామ్య కర్మను ఆరంభించే ముందు దీపారాధన చేయాలి. పాతరోజులలో మన ఇళ్లల్లో సూర్యాస్తమయానికి ముందుగానే దీపాన్ని వెలిగించేవారు. దీపంలో త్రిమూర్తులు, త్రిశక్తులు కొలువై ఉంటారు కావున శుభానికి సంకేతంగా దీపం వెలిగిస్తారు.
దీపారాధన ఎప్పుడు చేయాలి?
