అంతకు మించి…
నగరానికి (city) దూరంగా… ఎక్కడో పొలాల మధ్య.. అంతగా జనసంచారం లేని నిర్మానుష్య ప్రాంతాల్లో…విసిరేసినట్టుగా కనిపిస్తాయి. అవి ఎప్పుడో ఒకటీ అరా కార్లు రయ్యిన వచ్చిపోవడం తప్ప, బయటి జనాలకు అందులో ఏం జరుగుతుందో తెలిసే ప్రసక్తే లేదు. అప్పుడప్పుడు వీకెండ్స్ లో మాత్రం పరిసరాలు దద్దరిల్లిపోయేలా డీజే సౌండ్లు (DJ sounds).. ఖరీదైన కార్ల (Expensive cars) సందళ్ళతో ఫాంహౌజ్ లు కళకళలాడిపోతుంటాయి. కొన్ని ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి… మరికొన్ని నిర్మాణంలో ఉన్న భవంతుల్లాగా అనిపిస్తాయి.
ఉన్నట్టుండి ఎక్కడో జరిగిన ఏదో అక్రమ లావాదేవీలకు, భారీ కుంభకోణాల (Huge scandals) కు ఇలాంటి వేదికగా పేరు బయటకొచ్చేసరికి ఉలిక్కిపడడం స్థానికుల వంతవుతుంది. ఆటా, పాటా.. హంగామాల మాటున అసాంఘీక కార్యకలాపాలకు నిలయాలుగా మారిపోయిన ఫాం హౌజ్ ల (Farmhouses) కథా-కమామిషూ ఏంటో చూస్తే…
విదేశీ మద్యాన్ని (Foreign liquor) అందుబాటులో ఉంచడంతో పాటు పొరుగు రాష్ట్రాల యువతులతో ముజ్రా, రేవ్ పార్టీల (Mujra and rave parties) కు ఫాం హౌజ్ లు-రిసార్టులు (Farmhouses-Resorts) నిర్వహిస్తున్నారు. భాగ్యనగరం చుట్టూ 30-40 కి.మీ.ల పరిధిలోనే సుమారు ఐదు వందలకు పైగా ఫామ్ హౌజ్ లు ఉన్నాయి. కొన్ని ఫామ్ హౌజ్ లు, రిసార్టులు వ్యభిచార గృహాలు గా మారాయి. వీకెండ్స్ (Weekends) పలువురు తమ ఫామ్ హౌస్ లను అద్దెకు ఇస్తున్నారు. లీజుకు తీసుకున్న వ్యక్తులు అందులో అసాంఘీక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడకు వచ్చే అతిథులకు అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నారు. బర్త్ డే పార్టీల (Birthday parties) పేరు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల (other states) కు చెందిన యువతులతో అశ్లీల నృత్యాలు, అందుబాటులో విలాసవంతమైన స్టే లు చేయిస్తూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. దీనికితోడు మద్యం, డ్రగ్స్ (Alcohol, drugs) సమకూరుస్తుండడంతో చాలామంది ఇక్కడికి వచ్చి మజా చేస్తున్నారు.
అసలెక్కడివీ రేవ్ పార్టీలు?
60వ దశకంలో యూరోపియన్ దేశాల్లో మద్యం కోసం రేవ్ పార్టీలు (Rave parties) నిర్వహించేవారు. 80వ దశకానికి వచ్చేసరికి పరిస్థితి మారింది. 90వ దశకంలో పార్టీల స్వరూపం పూర్తిగా మారిపోయి అసాంఘీక, చట్ట విరుద్ధ కార్యక్రమాలకు కొన్ని ఫామ్ హౌజ్ లు అడ్డాగా మారాయి. పోలీసులకు అందిన సమాచారంతో అడపాదడపగా దాడులు నిర్వహిస్తున్నారు. కేసులు నమోదు (cases Registration) చేస్తున్నప్పటికీ.. ఈ దందాకు అడ్డు కట్ట పడటం లేదు. గత ఏడాదిలో ఫామ్ హౌజ్ లో జరిగిన రేవ్ పార్టీ పెద్ద దుమారమే రేపింది.
ప్రస్తుతం రేవ్ పార్టీలను 24 గంటల నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. యువతులతో అశ్లీల నృత్యాలు చేయించడంతో పాటు వ్యభిచారం నిర్వహిస్తుండగా.. ఒక్కో కాల్ గర్ల్ కు రూ.10 నుంచి 25వేల వరకు చెల్లిస్తున్నట్లు తెలిసింది. కొంతమంది ఈవెంట్స్ నిర్వాహకులు (Event organizers) యువతులను వారం, నెల, వారీగా.. వేలు, లక్షల రూపాయలకు కాంట్రాక్ట్ కుదుర్చుకుని, పార్టీలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం.
తాజాగా నగరానికి చెందిన ఐటీ ఉద్యోగి ఒకరు రెండు రోజుల క్రితం మొయినాబాద్ మండలం (Moinabad Mandal) మేడిపల్లి గ్రామ సమీపం లోని ఓ ఫామ్ హౌజ్ లో స్నేహితులకు బర్త్ డే పార్టీ ఇచ్చారు. ఈ వేడుకల్లో డ్రగ్స్ తో పాటు, అక్రమ మద్యం ఉపయోగించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఇలా అడపాదడపగా.. ఎక్కడో ఒక చోట ఫామ్ హౌస్ లలో అక్రమ వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. కొంత మంది పాత నేరస్తులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నగర శివార్లలోని ఫామ్ హౌజ్ లను అడ్డాలుగా చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అలాగే కట్టలకొద్దీ అక్రమ నగదు నిల్వలను దాచడానికి కూడా కొంతమంది పొలిటిషియన్లు తమ బినామీల ఫాం హౌజ్ లను యధేచ్చగా ఉపయోగిస్తున్నారు. ఇక పలువురు రాజకీయ ప్రముఖులు (Political leaders), సినీ, వ్యాపార రంగాలకు చెందిన పెద్దలు, వారి పిల్లలు అమ్మాయిలకు మాయమాటలు చెప్పి తీసుకొచ్చి ఎంజాయ్ చేసేందుకూ ఇవి కేంద్రాలుగా మారుతున్నాయి. వీటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చడం, పోలీసుల నిఘా పెంచడం వల్ల ఫాం హౌజ్ ల దురాగతాలను కొంతవరకు అరికట్టవచ్చని పలువురి అభిప్రాయం.