అసలు ఏం జరిగింది..?
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : వ్యవసాయం చేసే ఎద్దులు నీట మునిగి మరణించిన సంఘటన నంద్యాల జిల్లా(Nandyala District)లో చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్ల కాలువలో ఈ రోజు మూడు ఎద్దులు మునిగి చనిపోయాయి. గ్రామానికి చెందిన బడే సాహెబ్ గిడ్డి ముత్తునే(Bade Saheb Giddi Muthune) రైతు ఎద్దుల బండితో సహా శుభ్రం చేయటానికి చెరువులోకి తీసుకెళ్లారు. ఎద్దులు చెరువులోతు తెలియక ముందుకు వెళ్లాయి.
బండికి కట్టిన తాళ్లు కారణంగా అవి ఒడ్డుకు చేరుకోలేక నీట మునిగి చనిపోయాయి. రైతు మాత్రం సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. సుమారుగా రెండు లక్షల విలువ చేసే ఎద్దులు మునిపోవటం.. పైగా వ్యవసాయం చేసి రైతుకు(Farmer) పొలం పనులు చేసేవి మరణించటంతో రైతు కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది.

