అసలు ఏం జరిగింది..?

అసలు ఏం జరిగింది..?

గోదావరిఖని టౌన్( ఆంధ్రప్రభ); రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే పట్టాల పక్కన 70 ఏళ్ల వృద్ధురాలు పడిపోయి ఉండడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. వృద్ధురాలు పేరు సూర్యుడుగా గుర్తించబడింది. ఆమె తాడిపత్రి గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. స్టేషన్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న గేట్ కీపర్ ఈ ఘటనను గమనించి వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించాడు.

తక్షణమే స్పందించిన ఆర్పీఎఫ్ సిబ్బంది మరియు 108 బృందం కలిసి ఆ వృద్ధురాలిని రక్షించి, గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమె కుడి కాలు, కుడి చేయి విరగడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. 108 సిబ్బందిలో ఎమర్జెన్సీ టెక్నీషియన్ పడాల అభిరామ్ మరియు పైలట్ నడిగట్టు సదానందం ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply